అభివృద్ధిలో రాజీవద్దు

CM BABU
CM BABU

అభివృద్ధిలో రాజీవద్దు

– పరిపాలన రాజకీయాలతో ముడిపడి ఉంటుంది
– ఇ-గవర్నెన్స్‌ద్వారానే పరిపాలనా సౌలభ్యం
– అతితక్కువ ద్రవ్యోల్బణంలో దేశంలో ఎపి సెకండ్‌
– పనితీరు బాగున్న శాఖలకు గ్రేడింగ్‌ ప్రకటించిన సిఎం
– కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సిఎం బాబు

అమరావతి,µ: పరిపాలన రాజకీయాలతోనే ముడిపడి ఉందని ప్రతిఅధికారి అభివృధ్ధి విషయంలో రాజీ లేకుండా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌ ద్వారానే పరిపాలన జరగడం అధికారుల కృషేనని ద్రవ్యోల్భణంలో ఆంధ్ర ప్రదేశ్‌ దేశంలో రెండోస్థానాన్ని ఆక్రమించుకుని 9 శాతం సాధించగా తెలం గాణ రాష్ట్రం 10వ స్థానానికి పడిపోయిందని జిఎస్‌డిపిలోకూడా రాష్ట్రమే అగ్రగామి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

శుక్రవారం ఉండ వల్లిలోని ప్రజా వేదికలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాలవారీగా జరిగిన అభివృద్ధి సంక్షేమ పధకాల అమలు, తీరుతెన్నులు ప్రతి అంశంపై ఆయన కలెక్టర్లతో సమీక్షించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకోవాలని పొలిటికల్‌ గవర్నెన్స్‌ దిశగా ముందుకువెళ్లాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. దేశ రాజకీయాలు రాష్ట్రం మీద ప్రభావం చూపుతున్నాయని రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుంటే తాము దేశంతో పోటీపడగలమని.. దేశంబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిల బెట్టుకోలేదని రాష్ట్రానికి వచ్చిన కష్టంఎదుర్కొంటున్నామని ఇప్పటివరకు పోల వరం ప్రాజెక్టు కొరకు రూ. 16,000 కోట్లు ఖర్చుచేశామని ఇంకా కేంద్రం దాదాపు రూ.3,500 కోట్లు, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం ఖర్చుచేసిన మొత్తంలో రూ.3,300 కోట్లకు పైబడి కేంద్రం బకాయి పడిందని ఆయన కలెక్టర్లుకు గుర్తుచేశారు.నాటి కాంగ్రెస్‌ పాలనలోనే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని నేడు బిజేపి నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు విద్యుత్‌ నిరాటంకంగా సరఫరాచేస్తూ మిగిలిన వినియోగదారులకు విద్యుత్‌ 24 గంటలూ అందిస్తామని విద్యుత్‌ఛార్జీలు పెంచే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి కలెక్టరు వయాడక్‌ విధానానికి సంబంధించిన విజన్‌, ఇన్నోవేషన్‌, ఉబరైజేషన్‌, కన్వర్జెన్స్‌, అకౌంటబిలిటి, డిజిటలైజేషన్‌, టెక్నాలజీ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌వంటి 26 ప్రతిష్టాత్మక పధకాలపై కలెక్టర్లకు దశాదిశలను సీఎం బాబు నిర్ధేశించారు.జిల్లాలో ప్రతి కలెక్టర్‌ 133 కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరిపాలన అందించాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీజీఎస్‌ కేంద్రంద్వారా ప్రతి అంశాన్ని అనుసంధానం చేసి పాలన సాగించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. శాఖలవారీగా గ్రేడింగ ్‌లను వివరిస్తూ వెనుకబడిన శాఖలు ముందంజ లోనికి తీసుకురావడానికి జిల్లాస్థాయిలో కలెక్టర్లు రాష్ట్రస్థాయిలో హెచ్‌ఒడిలు ప్రభుత్వ ముఖ్యకార్య దర్శులు కృషిచేయాలని ఆయన కోరారు. ప్రగతి సాధించిన శాఖల్లో ‘ఏ కేటగిరికింద జలవనరుల అభివృధ్ధిశాఖ 150.2శ ాతం ప్రగతి సాధించి అగ్రగామిగ నిలవగా అదే ‘ఏ కేటగిరికింద వ్యవసాయం,