తదుపరి గుజరాత్ సిఎంగా ఎవరు ఉండాలి?: ఆప్‌ ఓటింగ్‌

అభిప్రాయం తెలియజేయలని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

CM Arvind Kejriwal launches AAP’s ‘Choose your Chief Minister’ campaign for Gujarat election

గాంధీనగర్ః ఢిల్లీ సీఎం, ఆప్ ముఖ్యనేత అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ..పంజాబ్ మాదిరే గుజరాతీ పౌరులకు తమ ముఖ్యమంత్రి ఎవరో ఎంపిక చేసుకునే ఆప్షన్ ను కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి’’అని కోరారు. 6357000360 నంబర్ కు వాయిస్ మెస్సేజ్, వాట్సాప్, ఎస్ఎంఎస్ లను నవంబర్ 3 నాటికి పంపించాలని సూచించారు.

అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ మెయిల్ ఐడీని కూడా ప్రకటిస్తామన్నారు. ఫలితాలను 4న వెల్లడిస్తామని చెప్పారు. అలాగే, పనిలో పనిగా అధికార బిజెపిపై ఆయన విమర్శలు చేశారు. తదుపరి ఐదేళ్ల విషయంలో బిజెపి వద్ద ప్రణాళిక ఏదీ లేదన్నారు. ఏడాది క్రితం వారు ముఖ్యమంత్రిగా విజయ్ రూపాణిని తొలగించి భూప్రేంద పటేల్ ను నియమించారు. ఆ సందర్భంలో ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. కానీ, మేము అలా చేయడం. ఆప్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్ ఎన్నికలకు ముందు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారిలో మీ మద్దతు ఎవరికో తెలియజేయాలని ఆప్ ప్రజలను కోరడం తెలిసిందే. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు భగవంత్ మాన్ ను ఎంపిక చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/