ఇరాన్ లో గ్రామాల సరిహద్దులు మూసివేత

కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు

Iran Villages-Coronavirus crisis

కరోనా కట్టడికి ఇరాన్ లో గ్రామాల సరిహద్దులను మూసివేశారు. ఊరికీ, ఊరికీ మధ్య సరిహద్దులను మూసివేయడం ద్వారా కరోనా వ్యప్తిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇరాన్ లో గురువారం ఒక్క రోజే కరోనా కారణంగా 157 మంది మరణించారు.

దీంతో ఈ దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,234కు చేరుకుంది.

కరోనా సోకిన వారి సంఖ్య 30 వేలు దాటింది. ఈ నేపథ్యంలోనే ఊళ్ల మధ్య ప్రయాణాలను కూడా ఇరాన్ నిషేధించింది.