భారత్‌లో అమెరికా కాన్సులేట్లు మూసివేత

america, india
america, india

అమెరికా: భారత్‌లో అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కరోనా ధాటికి వణికిపోతున్న అమెరికా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇప్పటికే యూరప్‌కు రాకపోకలను నిషేధించింది. తాజాగా భారత్‌లో ఉన్న అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని రకాల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నామని, వీసా ప్రాసెస్‌ రీ షెడ్యూల్‌ చేసుకోవాలని కోరింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికన్‌ ఎంబసీ ప్రకటించింది. అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నియంత్రణకు 50 బిలియన్‌ డాలర్ల నిధిని కేటాయిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/