శ్రీశైలం డ్యామ్ గేట్లన్నీ మూసివేత

Srisailam Project
Srisailam Project

శ్రీశైలం: దేశవ్యాప్తంగా వానలు తగ్గుముఖం పట్టడంతో నదులకు వరద తగ్గుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లను మూసివేశారు. శ్రీశైలం జలాయానికి ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 73,583 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఔట్‌ఫ్లో 30,986 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, 210.99 టీఎంసీల మేర నీరుంది. శ్రీశైలం కుడిగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుండగా 30,986 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వెళ్తోంది. కొంత మేర వరద తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/