ప్రతిష్ఠాత్మక అవార్డును తిరస్కరించిన థెన్‌బర్గ్‌

greta thunberg
greta thunberg

స్టాక్‌హోం: పర్యావరణ మార్పులపై అశ్రద్ధ వహించడానికి మీకెంత ధైర్యం అంటూ ప్రపంచ నేతల్ని ఐరాస వేదికగా కడిగిపారేసిన 16ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌.. నాయకుల తీరుపై తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేసింది. 84దేశాలు సభ్యులుగా ఉన్న నోర్డియాక్‌ కౌన్సిల్‌ ప్రకటించిన ఎన్విరాన్‌మెంటల్‌ అవార్డుని నిరాకరించింది. నాయకులు దృష్టి సారించాల్సింది అవార్డుపై కాదంటూ మరోసారి చురకలంటించే ప్రయత్నం చేసింది. ఈ అవార్డు కింద దాదాపు రూ.36లక్షల నగదు బహుమతి అందజేస్తుండటం గమనార్హం. తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. పర్యావరణంపై చేస్తున్న పోరాటానికి అవార్డుల అవసరం లేదు. అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలపై అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజలు దృష్టి సారించడమే మనకిప్పుడు కావాల్సింది అని వ్యాఖ్యానించింది. ఇక తన పోరాటాన్ని గుర్తించినందుకు నోర్డియాక్‌ కౌన్సిల్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పర్యావరణ సమస్యలపై నోర్డియాక్‌ తగిన రీతిలో స్పందించడం లేదని విమర్శించింది. సమస్యపై స్పందిస్తూ అందమైన పదాలు వాడడం, గొప్పలు చెప్పుకోవడంలో ఎలాంటి లోపం లేదు. కానీ, తలసరి ఉద్గారాల విడుదల తగ్గింపు విషయానికి వస్తే మాత్రం వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి అంటూ చురకలు అంటించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/