వచ్చే ఏడాదిలోనే క్లిజ్స్టర్స్ రీఎంట్రీ!

Kim Clijsters
Kim Clijsters

బ్రసెల్స్‌: బెల్జియం స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కిమ్ క్లిజ్స్టర్స్ ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నమెంట్‌కు వచ్చేలా కనిపించడంలేదు. 36 ఏళ్ల క్లిజ్స్టర్స్ కు మోకాలి గాయం అడ్డంకి కారణంగా వచ్చే ఏడాదిలో మార్చిలో పునరాగమనం చేసేలా ఉంది. తన మోకాలి గాయం నుంచి కోలుకుని మార్చిలో మెక్సికో వేదికగా జరిగే మాంట్రెరీ టోర్నీలో తాను మళ్లీ మైదానంలోకి అడుగిడుతానని తెలిపింది. మరికొద్ది రోజుల సమయం పట్టోచ్చు తాను సిద్ధమవడానికి అంటూ పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియోను తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దీంతో క్లిజ్స్టర్స్ వచ్చే ఏడాదిలోనే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/