హైకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

విద్యుత్‌ సంస్థలకు ఊరట

AP High Court
AP High Court

అమరావతి:ఏపి ప్రభుత్వంపై పీపీఏలపై ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవో నంబర్‌ 63ను సవాల్‌ చేస్తూ విద్యుత్‌ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పీపీఏలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 63ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పాటు విద్యుత్‌ సంస్థలకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ రాసిన లేఖలనూ నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు హైకోర్టులో ఊరట లభించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/