జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్‌ చిట్‌

shikha chowdary
shikha chowdary

హైదరాబాద్‌: వ్యాపారవేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాం హత్యకేసులో విచారణ కొంత మెరుగుపడింది. ఆ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. వారు 388పేజీల ఛార్జిషీటును జూబ్లిహిల్స్‌ పోలీసులు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిపై పిడి యాక్టు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 70 మందిని ప్రశ్నించగా.. ఛార్జిషీట్‌లో రాకేశ్‌, సినినటుడు సూర్యప్రసాద్‌, అంజిరెడ్డి, నగేశ్‌, విశాల్‌, కిషోర్‌, శ్రీనివాస్‌, సుభాష్‌రెడ్డి పేర్లునమోదు చేసినట్లు తెలుస్తుంది.
జయరాం జనవరి 31న ఏపిలోని కృష్టాజిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/