విశాఖ తీరంలో ఉద్రిక్తత..

విశాఖ తీరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో వాసవాణిపాలెం,పెద్ద జలారిపేట మత్స్యకారులు మధ్య వివాదం చోటుచేసుకుంది. పెద్దజాలరిపేటకు చెందిన కొందరు తమపై మరణాయుధాలతో దాడి చేశారని వాసవాణిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. తమ ఆరు బోట్లకు నిప్పు పెట్టారని, వలలను సైతం దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలు క్రితం ఇదే తరహా వివాదం జరిగిందని… కలెక్టర్ కార్యాలయంలో చర్చలు జరిగాయని చెప్పుకొచ్చారు.

ఈ దశలో నిన్న రాత్రి చేపల వేట ముగించి తీరంలో లంగర్ వేసిన ఆరు బోట్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరొకసారి వివాదం ఏర్పడింది. తమ వలలకు దారుణంగా నిప్పు పెట్టి నష్టపరిచారని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రెండు గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగ కుండా అడ్డుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు చేపల వేట సాగుతుందని అంతవరకు ప్రజలు సమయంనంతో ఉండాలని సూచించారు.