నాంపల్లిలో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుంగపాడులో ఏర్పాటు చేసిన బిజెపి చేరికల కార్యక్రమంలో రాజగోపాల్​రెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో దగ్గరలోని గణేష్ మండపం వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్​రెడ్డికి సంబంధించిన పాటను పెట్టారు. దీంతో బిజెపి కార్యకర్తలు ఆ పాటను నిలిపివేయాలని వారితో గొడవకు దిగారు.

ఈ క్రమంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరిన సంగతి తెలిసిందే. బిజెపి నుండి మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగబోతున్నాడు. ఈ క్రమంలో నియోజకవర్గం లో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ ఫై నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్నారు.