లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎన్‌వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌వీ రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు.

అంతకుముందు వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్‌వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం ఆలయ పునర్‌ నిర్మాణ పనులను వారు వీక్షించనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/