కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు : సీజేఐ ఎన్వీ రమణ

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ జ్యూడీషియ‌ల్ ఆఫీస‌ర్స్ కాన్ఫ‌రెన్స్ స‌ద‌స్సు హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో జరిగింది. సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారాయ‌న‌. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న జ‌డ్జీల పెంపు ఎట్ట‌కేల‌కు పూర్త‌యింద‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. ఎక్కువ‌మంది జ‌డ్జీల‌ను నియ‌మించి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర‌చాల‌ని భావించాం అన్నారు. గ‌త రెండేళ్ల‌లో ఎక్కువ మంది జడ్జీల నియామ‌కం జ‌రిగింద‌న్నారు. జిల్లా కోర్టుల్లో జ‌డ్జీల సంఖ్య పెంచుతున్నాం అన్నారు సీజేఐ. సీఎం కేసీఆర్ అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.

హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరమన్నారు. రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామన్నారు. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు. చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/