సుప్రీంకోర్టు చెబితే వ్యతిరేకించడం అసాధ్యం

సీఏఏపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌

Kapil Sibal
Kapil Sibal

కోజికోడ్‌(కేరళ): ఎన్నార్సీకి సహకరించబోమని చెప్పడమంటే… కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధికారులు సహకరించరని చెప్పడమేనని… ఇది అంత సులభమైన పని కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని… కాదని చెప్పడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. సీఏఏ అనేది జాతీయ అంశమని… దీన్ని జాతీయ స్థాయిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సిబాల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని చూడరాదని… కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని అన్నారు. సీఏఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. సీఏఏను విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగబద్దమైన హక్కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని చెప్పారు. అయితే సీఏఏ రాజ్యాంగబద్దమైనదేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం… దాన్ని వ్యతిరేకించడం అసాధ్యమవుతుందని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/