తేజు కోలుకోవాలని సినీ ప్రముఖులు , ఫ్యాన్స్ ట్వీట్స్

శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖులు, అభిమానులు షాక్ కు గురైయ్యారు. మెగా ఫ్యామిలీ మొత్తం హాస్పటల్ కు చేరుకొని తేజ్ ఆరోగ్యం ఫై ఆరాతీసారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్స్ చెపుతున్నారు.

ఇక తేజు త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ , థమన్ , బండ్ల గణేష్, రవితేజ , మంచు విష్ణు , దేవి శ్రీ , డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు ట్వీట్స్ చేసారు. అలాగే తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాధుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు.

Wishing u a speedy recovery my dear tammudu @IamSaiDharamTej ❤️❤️— Gopichandh Malineni (@megopichand) September 11, 2021

Wishing dear Brother @IamSaiDharamTej a very speedy recovery 🙏🏻🙏🏻❤️❤️

All our Love n Prayers with U Dear !! You wil be perfectly fine in no time ! 🎶🎶🤗🤗❤️❤️— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 10, 2021

Praying for the speedy recovery of my little brother @IamSaiDharamTej— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2021

Wishing you a speedy recovery @IamSaiDharamTej. Get well soon…— Ravi Teja (@RaviTeja_offl) September 11, 2021

God always with you @IamSaiDharamTej is absolutely fine and recovering. Nothing to worry. He is under precautionary care in hospital.— BANDLA GANESH. (@ganeshbandla) September 10, 2021

My #Nanban Will be Fine ♥️

My Prayers for ur Speedy Recovery 🍀— thaman S (@MusicThaman) September 10, 2021

Wishing you a speedy recovery brother @IamSaiDharamTej ❤️— Jr NTR (@tarak9999) September 11, 2021

హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో బైక్ స్కిడ్ కావడం తో తేజ్ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ఫై ఇసుక ఉండడం తో బైక్ స్కిడ్ అయినట్లు సమాచారం,. ఈ ప్రమాదంలో తేజ్ కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ముందుగా సమీపంలోని మాదాపుర్ మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.