అమెరికాలో కాల్పులు..ఇద్దరు మృతి

Gun firing in america
Gun firing in america

ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఓ మైనర్‌ బాలుడు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రివియెరా బీచ్‌ సమీపంలోని విక్టరీ సిటీ చర్చి వద్ద అంత్యక్రియలకు హాజరై వస్తున్న జన సమూహంపై దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఆస్పత్రి వర్గాలు ఎలాంటి నివేదికలు విడుదల చేయలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/