మమ్మల్ని ఢీకొంటే నుగ్గు నుగ్గు అవుతారు

Mamata Banerjee
Mamata Banerjee

కోల్‌కత్తా: రంజాన్‌ పండుగ సందర్భంగా పశ్చిబెంగాల్‌లో ఏర్పాటు చేసిని ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతు త్యాగానికి మారు పేరు హిందువులు. నిజాయతీకి నిదర్శనం ముస్లింలు. ప్రేమకు ప్రతిరూపాలు క్రైస్తవులు. సిక్కుల మారు పేరు బలిదానం. ఇదే పవిత్ర భారతదేశం. దీన్ని మేం రక్షించుకుంటాం. ఈ క్రమంలో మమ్మల్ని ఢీకొంటే నుగ్గు నుగ్గు అవుతారు. ఇదే మా నినాదంగగ అని ఆమె వ్యాఖ్యనించారు. అయితే బెంగాల్‌లో బిజెపి గెలుపుపై ఆమె సూర్యోదయంతో పోల్చారు. ఈవీఎంలలో అవకతవకలు చేసి రాష్ట్రంలో తన ప్రాభవాన్ని చాటుకున్న బిజెపి త్వరలోనే సూర్యుడి వలే అస్తమిస్తుందని అభిప్రాయపడ్డారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/