పది నిమిషాల్లోనే చాకోచిప్‌ కుకీస్‌

రుచి: వెరైటీ వంటకాలు

Chocochip cookies
Chocochip cookies

ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు చేయడం నచ్చలేని వాళ్లు కొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంటారు.

అలాంటి వారు ఓ సారి చాకోచిప్‌ కుకీలను తయారు చేసి చూడండి. ఇది తెలిసిన వంటకమే అయినా తక్కువ పదార్థాలతో, చాలా తొందరగా చేయడం తెలిస్తే ఇక ఎప్పుడు దీనిని వదలరు.

ఈ రకమైన బిస్కెట్లు తయారు చేయడానికి కేవలం పది నిమిషాలే సరిపోతుంది. అలాగే దీనికి ఓవెన్‌, ఎగ్స్‌ కూడా అవసరం లేదు.

కావున శాఖా హార ప్రియులు కూడా లాగించేయవచ్చు. చిన్న వాళ్ల నుంచి ముసలి వాళ్లవరకు అందరికి ఈ చాకోచిప్‌ కుకీలు నచ్చుతాయి.

బయట భాగలో క్రంచీగా, లోపల మృదువుగా ఉంటాయి. దీని తయారీకి మీకు కావలిసిదల్లా కేవలం మూడు పదార్థాలు మరి అవేంటో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

2 టేబుల్‌ స్పూన్లు – చాకో చిప్స్‌ , 100 గ్రా – వెన్న 1/2 కప్పు-పొడి చేసిన చక్కెర, 1 కప్పు- మైదా పిండి

తయారు చేయు విధానం :

ముందుగా ఒక గాజు గిన్నె 100 గ్రాముల వెన్న వేసి మెత్తటి మిశ్రమంలా అయ్యే వరకు గిలకొట్టండి. అందులో అరకప్పు పొడిగా చేసిన చక్కెర కలపండి. దీనిని మెత్తగా కలపాలి.

తరువాత ఇందులో ఒకటి పావు మైదా పిండిని జోడించండి.రుచికి సరిపడా ఉప్పువేసి మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండే పిండి ముద్దలా తయారు చేసుకోవాలి.

2 టేబుల్‌ స్పూన్ల చోకో-చిప్‌కుకీలను వేసి పూర్తిగా కలపాలి. నాన్‌-స్టిక్‌ పాన్‌ తీసుకోని ఆయిల్‌వేసి దానిపై వెన్న కాగితాన్ని ఉంచి మరోసారి నూనెతో తడపాలి.

చేతిలోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని
చిన్న బంతిలాగా చేసి అరేతులతో దాన్ని కొంచెం వెడల్పు చేయాలి. పాన్‌లో సరిపోయేంతలా చిన్నగా చేసుకుని ప్రతి పిండి ముద్దకు మధ్యలో సరైన గ్యాప్‌ ఉంచాలి.

ఇప్పుడు కుకీలకు కొద్దిగా చోకో-చిప్స్‌ జోడించండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పాన్‌పై మూత పెట్టి తక్కువ మంటతో 10 నిమిషాలపాటు వేడి చేయండి.

స్టవ్‌ కట్టేసి పాన్‌పై మూతతీసి కుకీలు పూర్తిగా చల్లబడేదాకా ఆగండి. అంతే నోరూరించే టేస్టీ, క్రంచీ కుకీలు రెడీ. ఇంకేందుకు ఆలస్యం టెస్ట్‌ చేయండి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/