థ్యాంక్యూ మిత్రమా అంటూ మోహన్ బాబు కు చిరు రిప్లయ్

మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ఆయన్ను ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022గా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. మెగాస్టార్ కు ఈ అవార్డు రావడం పట్ల మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ..సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవికి కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘మై డియర్‌ చిరంజీవి. గోవాలో జరుగుతున్న ఇఫీ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోబోతున్నందుకు అభినందనలు. షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో మీరు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. మోహన్‌ బాబు ట్వీట్‌కు చిరంజీవి స్పందించారు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.