దెయ్యం అవతారంలో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి దెయ్యం అవతారంలో మారిపోయాడు. గతంలో ‘దొంగ’ సినిమాలో గోలీమార్ అనే సాంగ్ లో భయపెడుతూనే సూపర్ స్టెప్స్ వేసి అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు మరోసారి చిరు అదే గెటప్ లో రివీలై.. అభిమానుల్ని థ్రిల్ చేశారు. అయితే అది సినిమా కోసం కాదులెండి. అక్టోబర్ 31 న హాలోవిన్ డే. చాలా మంది సెలబ్రెటీస్ ఘోస్ట్ గెటప్ తో ఫన్నీగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాలోవీన్ సెలబ్రేష‌న్స్ చేసుకున్నారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆయ‌న త‌న హాలోవీన్ లుక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డే అని క్యాప్ష‌న్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆరున్న‌ర ప‌దులు వ‌య‌సు దాటినా ఆయ‌న ఎంతో ఉత్సాహంగా పిల్ల‌ల‌తో పోటీ ప‌డుతూ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌డం ఆయ‌న ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తుంది.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య పూర్తి చేసాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్‌ఫాద‌ర్ సినిమాచేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే భోళా శంక‌ర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి చిరంజీవి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.