చిరంజీవి మేనేజర్ గంగాధర్ తల్లి మిస్సింగ్

చిరంజీవి మేనేజర్ గంగాధర్ తల్లి కనిపించడం లేదు. గంగాధర్ తల్లి నరాలశెట్టి సత్యవతి (పాపాయమ్మ) 85 సంవత్సరాలు. శనివారం అర్ధరాత్రి నుంచీ ఆమె కనిపిచండం లేదని గంగాధర్ మీడియాకు తెలిపారు. జ్ఞాపక శక్తి కోల్పోయిన కారణంగా అర్ధరాత్రి తెలియకుండా ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయారని .. ఎవరికైనా కనిపించినా.. ఆమెలా అనిపించినా వెంటనే తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తన తల్లిని గుర్తుపట్టడానికి ఒక ఫొటోను కూడా విడుదల చేశారు.

ఈ ఫొటోలో తల్లితో పాటు గంగాధర్ కూడా ఉన్నారు. గంగాధర్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కొమరగిరి కొలవరి మెరక గ్రామం. అక్కడే గంగాధర్ తల్లి అదృశ్యమయ్యారు. తన తల్లి ఎవరికైనా కనబడితే 9866776669 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరుతున్నారు. మేనేజర్ నరాలశెట్టి గంగాధర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగా అభిమానులకు అయితే ఈయన గురించి పరిచయం కూడా అవసరం లేదు. బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గంగాధర్.. చాలా కాలంగా చిరంజీవికి మేనేజర్‌గా ఉన్నారు. ‘ఆచార్య’ సినిమా విడుదల సమయంలో గంగాధర్ మీడియాతో మాట్లాడిన వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి.