‘వేర్ ఈజ్ ది పార్టీ’ అంటూ వెంకీకి మెగాస్టార్ మెగా ట్వీట్

సీనియర్ హీరో వెంకటేష్ ఈరోజు తన 62 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఉదయం నుండి సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టిన రోజు విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ చిరంజీవి వెంకీ కి బర్త్డే విషెష్ తెలిపి వేర్ ఈజ్ ది పార్టీ అని అడిగాడు. ‘మై డియర్ వెంకీ.. హ్యాపీ బర్త్ డే.. వేర్ ఈజ్ ది పార్టీ?’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు వెంకీ నుండి రిప్లయ్ రాలేదు కానీ నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో రిప్లయ్ లు ఇస్తున్నారు.

ప్రస్తుతం వెంకీ సినిమాలు చేయడం బాగా తగ్గించాడు. తన ఏజ్ కి తగ్గ కథలు రాకపోవడం తో హీరోగా సినిమాలు చేయడం తగ్గించి , యంగ్ హీరోల సినిమాల్లో ప్రత్యేక రోల్స్ లలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక చిరు విషయానికి వస్తే..వాల్తేర్ వీరయ్య అంటూ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.