ఆర్ఆర్ఆర్‌లో మెగాస్టార్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, వారి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఇద్దరు హీరోలు కలిసి కనిపించే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ టీజర్‌లో ఓ మెగా సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.

ఆర్ఆర్ఆర్ టీజర్‌లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా దర్శకుడు రాజమౌళి చిరును కోరినట్లు తెలుస్తోంది. ఇలా ఆర్ఆర్ఆర్ టీజర్‌లో చిరంజీవి వాయిస్ ఓవరి పెడితే ఈ టీజర్‌కు అదిరిపోయే క్రేజ్ లభిస్తుందని ఆయన భావిస్తున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ టీజర్‌లో చిరు వాయిస్ ఓవర్ ఇస్తాడా లేడా అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తోండగా ఒలివియా మారిస్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.