సినిమా టికెట్ రేట్స్..సీఎం కేసీఆర్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

తెలంగాణ‌లో సినిమా థియేటర్ల మనుగడకు మేలు కలిగే నిర్ణయం ఇది: చిరంజీవి

హైదరాబాద్ : తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌ల‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. థియేటర్లలో టికెట్ రేట్ల పెంపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ అనుమ‌తులు అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో సినీ పరిశ్ర‌మ‌కు చెందిన వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ స‌ర్కారుకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న ట్వీట్ చేశారు.

‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ల‌ యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞ‌తలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’ అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ లకు కూడా మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/