హత్యాచార నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌పై చిరంజీవి స్పందన

హత్యాచార నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌పై చిరంజీవి స్పందన

ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన మానవ మృగం మరణ వార్త అందరిలో సంతోషం నింపుతుంది. సినీ , రాజకీయ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలిపారు.

అభం శుభం తెలియ‌ని ఆరేళ్ల చిన్నారిపై హ‌త్యాచారానికి పాల్ప‌డిన రాజు అనే కిరాత‌కుడు త‌న‌కు తాను శిక్ష‌ను విధించుకోవ‌డం బాధిత కుటుంబంతో పాటు మిగ‌తా అంద‌రికి కొంత ఊర‌ట క‌లిగిస్తుంది. ఈ సంఘ‌ట‌న‌పై మీడియా, పౌర స‌మాజం గొప్ప‌గా స్పందించాయి.

ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు ప్ర‌భుత్వంతో పాటు పౌర స‌మాజ చొర‌వ చూపాలి.అలాంటి కార్యక్ర‌మాలు ఎవ‌రు చేప‌ట్టినా నా స‌హ‌కారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్ర‌భుత్వం త‌గిన విధంగా ఆదుకోవాలి అని ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈరోజు ఉదయం స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై రాజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతడి చేతిపై ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు ఆ మృతదేహం రాజు దే అని ఖరారు చేశారు. ప్రస్తుతం రాజు మృతదేహాన్ని MGM హాస్పటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.