రామారావు గారి కీర్తి అజరామరం

ఎన్టీఆర్ ను స్మరించుకున్న చిరంజీవి

chiranjeevi-pays-tribute-to-ntr

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవ దివంగత ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/