సిఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించిన జగన్

Chiranjeevi Along with His Wife Surekha Meets cm Jagan
Chiranjeevi Along with His Wife Surekha Meets cm Jagan

అమరావతి:ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఈరోజు వెళ్లారు.
జగన్ కు చిరంజీవి పుష్పగుచ్ఛం అందజేశారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిగని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరారు. తరువాత ఇరువు కలిసి భోజనం చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి బడా స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదన్న విమర్శలు వైఎస్‌ఆర్‌సిపి నుండి వ్యక్తమయిన విషయం తెలిసిందే.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/