ఢిల్లీ చేరుకున్న మెగాస్టార్‌ చిరంజీవి

మోడి, అమిత్‌షాతో భేటి

modi-Chiranjeevi
modi-Chiranjeevi

హైదరాబాద్‌: సైరా సినిమా హిట్‌ కావటంతో చిరంజీవి గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సైరా సినిమా బంపర్‌ హిట్‌ కావటంతో విజయనందాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఏపి ముఖ్యమంత్రి జగన్‌ ను చిరంజీవి తన కుటుంబ సమేతంగా కలిసారు. తన సినిమాను చూడమని ఆహ్వనించారు. అలాగే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా ఈ చిత్రాన్ని చూసి, అద్బుతంగా ఉందని కితాబిచ్చారు. కాగా చిరంజీవి బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తో కలిసి ఢిల్లీ చేరుకున్నాడు. తొలుత ప్రధాని మోడి కలిసి సైరా సినిమాను చూడాల్సిందిగా కోరారు. అనంతరం కేంద్ర హోమంత్రి అమిత్‌షా ను కలవనున్నారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కలిసి సైరా సినిమాను వీక్షించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/