రాజమండ్రిలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి శనివారం రాజమండ్రికి వెళ్లనున్నారు. రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దివంగత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. దీనికి సంబదించిన అన్ని పనులను పూర్తి చేసారు. మరోపక్క చిత్రసీమలో ఆన్లైన్ టికెట్ వ్యవహారం , మా ఎన్నికలు వేడి కొనసాగుతుంది. ఈ తరుణంలో చిరంజీవి రాజమండ్రి టూర్ ఆసక్తి రేపుతోంది.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఇందులో ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ తో పాటు మోహన్ రాజా డైరెక్షన్లో ఓ మూవీ , మెహర్ రమేష్ డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ గా ఉంటూనే..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , ఫాలోయర్స్ ను అలరిస్తున్నాడు.