‘కొండపొలం’ అవార్డులు, రివార్డులు సాధిస్తుంది

– మెగాస్టార్ చిరంజీవి

Mega star Chiranjeevi with hero Vaishnav Tej and director Krish
Megastar Chiranjeevi with hero Vaishnav Tej and director Krish

మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొండపొలం ఈ సినిమా అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే మేకర్స్ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో చిరంజీవి ఈ చిత్రాన్ని వీక్షించారు.కొండపొలం వీక్షించిన అనంతరం చిరంజీవి సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్ టేకింగ్, వైష్ణవ్ తేజ్ నటన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇక ఈ చిత్రం భవిష్యత్తులో అవార్డులు, రివార్డులు కూడా సాధిస్తుందని చెప్పుకొచ్చారు.‘ఇప్పుడే కొండపొలం సినిమా చూశాను. అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ.. ఓ అందమైన, రస్టిక్ ప్రేమ కథను చూపించారు. నేను ఎప్పుడూ కూడా క్రిష్ పనితనాన్ని ప్రేమిస్తుంటాను. విభిన్న జానర్లను ఎంచుకోవడం, సమాజంలోని సమస్యలను తీసుకోవడం, ఆర్టిస్ట్‌ల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం క్రిష్‌లోని ప్రత్యేకత. ఈ సినిమా భవిష్యత్తులో అవార్డులను, రివార్డులను సాధిస్తుందనే గట్టి నమ్మకం ఉంది’ అని తెలిపారు.మామూలుగా ఈ సినిమా కథే అందరినీ ముందుగా ఆకట్టుకుంటోంది. కొండపొలం అని టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ అంచనాలు పెరిగాయి. ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు చిరంజీవి ప్రశంసలు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు.సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా.. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/