‘మేజర్‌’ ఫై మెగా ప్రశంసలు ..

అడివి శేషు హీరోగా నటించిన మేజర్ మూవీ ఫై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. కెరియర్ స్టార్టింగ్ నుండి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు అడివి శేష్..తాజాగా మేజర్ మూవీ తో జూన్ 03 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అడివి శేషు యాక్టింగ్ ఫై , శశి డైరెక్షన్లపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు సినిమా ఫై స్పందించగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన స్పందనను తెలియజేసారు.

ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి ‘మేజర్‌’ చిత్రబృందాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు.
మేజర్‌ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్‌. అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మంచి సినిమాల గురించి చిరంజీవి ఎప్పుడూ మాట్లాడడం , ట్వీట్స్ చేయడం చేస్తూ.. మేకర్స్‌ను అభినందిస్తుంటారు. తాజాగా ‘విక్రమ్‌’ మూవీ విజయం సందర్భంగా కమల్‌ హాసన్‌ను చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మేజర్.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చిరు..భోళా శంకర్ , గాడ్ ఫాదర్ చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.