సింగర్ కేకే మృతిపట్ల పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి

ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణ కుమార్ కన్నాధ్ (కేకే ) మృతి పట్ల యావత్ సంగీత లోకం షాక్ కు గురైంది. సినిమా ప్రపంచంలో అతను మంచి గాయకుడు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఇతర ప్రముఖులతో కూడా అతను ఎంతో స్నేహంగా ఉండే వారు. ఇక అతను పాట పాడితే సినిమా హీరోలు ప్రత్యేకంగా అతన్ని ప్రశంసించేవారు. అలాంటి కేకే ఇకలేరు అనే వార్త ను జీర్ణించుకోలేకపోతున్నారు. కేకే మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో సంతాపం తెలియజేస్తూ వస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు సోషల్ మీడియా ద్వారా దిగ్బ్రాంతి ని వ్యక్తం చేసారు.

KK దిగ్భ్రాంతికరమైన మరణంతో గుండె పగిలింది అంటూ.. అతను అద్భుతమైన గాయకుడు అని అతని పాటలో గొప్ప సోల్ ఉంటుందని అన్నారు. ఇక నా కోసం ‘ఇంద్ర’లోని ‘దాయి దాయీ దామా’ పాడాడు అంటూ.. అతని కుటుంబానికి అలాగే సన్నిహితులకు ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి అని అన్నారు. అలాగే కేకే ఆత్మకు శాంతి కలుగుగాలని ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసారు. గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరమని కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించిందని అన్నారు. ఇక సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి కోల్‌కతాలో కేకే మృతి చెందారు. కోల్‌కతాలో నిన్న (మంగ‌ళ‌వారం) రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న ఆయ‌న‌ గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు సీఎంఆర్‌ఐ డాక్ట‌ర్లు తెలిపారు. అంతకుముందు కేకే తన మ్యూజికల్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కేకే ఇకలేరు అనే విషయాన్నీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

1994లో వచ్చిన డబ్బింగ్ సినిమా ప్రేమదేశంలో కాలేజ్ స్టైల్, హలో డాక్టర్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో తెలుగులో కేకే ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఖుషిలో ఏ మేరా జహా సాంగ్ యూత్‌ను అప్పట్లో ఎంత ఉర్రూతలూగించింది. ఈ పాటను మణిశర్మ స్వరపరిచగా కేకే పాడారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ స్వరపరిచిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను కూడా ఆయన పాడారు. వాసు సినిమాలో పాటకు ప్రాణం, ఘర్షణలో చెలియా చెలియా, అపరిచితుడులో కొండకాకి కొండెదాన, మున్నా సినిమాలో రెండు పాటలను ఆయన పాడారు. కేకే మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక చిత్రాల్లో పాటలు పాడడం జరిగింది.