సైమా అవార్డులకు ముఖ్య అతిథిలు

Chiranjeevi-and-Mohanlal
Chiranjeevi-and-Mohanlal

హైదరాబాద్‌: తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహించే సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఆగస్టు 15న తెలుగు, కన్నడ చిత్రసీమలకు సంబంధించి జరిగే అవార్డు వేడుకలో ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేయనున్నారు.16వ తేదీన జరిగే తమిళ, మలయాళ పురస్కారాల వేడుకకు మోహన్‌లాల్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. కాగా అక్కడ వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులతో ఆగస్టు 15, 16వ తేదీల్లో సైమా అవార్డుల వేడుకలను ఖతార్‌లోని దోహాలో ఘనంగా నిర్వహించనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/