టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. వివాహ కార్యక్రమానికి హాజరై వస్తున్న చింతమనేనిని.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయిన చింతమనేని.. మరోసారి కటకటాలపాలయ్యాడు.

పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా చింతమనేని ప్రభాకర్ ఎడ్ల బండిని నడిపారు. పోలీసుల విధులకు చింతమనేని ఆటంకం కలిగించారని చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెళ్లికి హాజరై వస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో అరెస్ట్‌ చేసిన ఈయన్ను పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.