చైనా శాస్త్రవేత్త ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్

కరోనా చైనా ల్యాబ్ లోనే పుట్టిందన్న లీ మెంగ్ యాన్

చైనా శాస్త్రవేత్త ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్
Chinese scientist Li Meng Yan

బీజింగ్‌: కరోనాపై చైనాకు చెందిన మహిళా సైంటిస్ట్ లీ మెంగ్ యాన్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ తమ ల్యాబ్ లోనే పుట్టిందని ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆమె ఈ ప్రకటన చేయడానికి ముందే అమెరికాకు వెళ్లిపోయారు. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తాజాగా ఆమెకు షాక్ ఇచ్చింది. తమ నిబంధనను ఉల్లంఘించినందుకు ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆమె అకౌంట్ లో ప్రస్తుతం ఈ సందేశమే కనిపిస్తోంది. అయితే ఆమె పెట్టిన ఏ ట్వీట్ తమ నిబంధనలను అతిక్రమించిందో ట్విట్టర్ తెలపలేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/