చైనా అధ్యక్షుడి పాకిస్థాన్‌ పర్యటన వాయిదా

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం

Jinping
Jinping

రావల్పిండి: పాకిస్థాన్‌ పర్యటనను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వాయిదా వేసుకున్నట్లు పాక్‌లోని ఆ దేశ రాయబారి యావో జింగ్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశ ప్రభుత్వాలను సంప్రదించి త్వరలో కొత్త షెడ్యూల్‌ ఖరారు చేస్తామని వెల్లడించారు. పింగ్‌ను పాక్‌ పర్యటనకు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/