అమెరికాను ఎదుర్కొనేందుకు చైనా ఎత్తుగడ

america with China
america with China

బీజింగ్‌: చైనా వాణిజ్య యుద్దాన్ని బలంగా ఎదరుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. తన కరెన్సీ యూనిట్‌ యువాన్‌ విలువను డాలర్‌తో పోలిస్తే 0.6 శాతం తగ్గించింది. దీంతో డాలర్‌ విలువ 6.8365 యువాన్లకు సమానమైంది.చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకొంది.చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకొంది. అయితే చైనా నిర్ణయం మిగిలిన దేశాల వాణిజ్యంపై తీవ్రప్రభావం చూపనుంది. చైనాలో దిగుమతులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాకపోతే ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని చైనా ఈ నిర్ణయం తీసుకొంది. కాకపోతే చైనా విదేశీ అప్పులు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది.. అప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడుతుందిఅమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు పడుతుండటంతో వాటి ధరలు సహజంగానే పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో వాటికి డిమాండ్‌ తగ్గుతుంది. ఇది చైనా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలోపెట్టుకొని చైనా డాలర్‌తో పోలిస్తే యువాన్‌ విలువను తగ్గించింది. ఫలితంగా అంతర్జాతీయంగా తక్కువ డాలర్లతోనే ఎక్కువ చైనా వస్తువులు లభించే పరిస్థితి నెలకొంటుంది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/