అరుణాచల్‌లో ఐదుగురిని అపహరించిన చైనా సైన్యం!

సుబానాసిరి జిల్లాలో అపహరించారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

congress-mla-from-arunachal-pradesh-said-to-pmo-china-army-kidnapped-5-indian-citizens

ఇటానగర్‌: భారత్‌ సరిహద్దుల్లో చైనా సమస్యలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చైనా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైనికులు అపహరించారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ మాట్లాడుతూ, సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయని… గతంలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్పారు. స‌రిగ్గా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో చైనా, ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రుల‌తో స‌మావేశం కొన‌సాగుతున్న స‌మయంలోనే ఇది జరిగింద‌న్నారు. ఇలా చేయ‌డంవ‌ల్ల‌ చైనా సైన్యం త‌ప్పుడు సంకేతాల‌ను పంపిస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ ఐదుగురి పేర్ల‌ను కూడా వెల్ల‌డించారు. అంతేకాదు ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి కూడా ట్యాగ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/