చినరాజప్పను గృహ నిర్బంధం

‘చలో గుంటూరుగ’ టిడిపి నేతలు

Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa

అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా నిరసనలకు, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ‘చలో గుంటూరు’ పిలుపుమేరకు వెళ్తున్న టిడిపి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో టిడిపి నేత చినరాజప్పను గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై అడ్డుపడుతూ.. టిడిపి నేతలు, కార్యకర్తలను నిర్బంధించడం సరికాదని చెప్పారు. గృహ నిర్బంధాలతో అమరావతి ఉద్యమాన్ని అపలేరని అన్నారు. కాగా, చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని టిడిపి నాయకులు చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు వైఎస్‌ఆర్‌సిపి కుట్రలు పన్నుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నూకసాని బాలాజీతో పాటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజలను టిడిపి కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు విజయవాడలో మొగల్రాజపురంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. అంతేగాక, కాకినాడ గ్రామీణంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మిని హౌస్ అరెస్టు చేశారు. భీమవరంలో మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మిని గృహ నిర్బంధం చేశారు. గుంటూరులోని పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు వద్ద పోలీస్ పికెటింగ్ చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/