అమెరికా వెళ్లేవారు జాగ్రత్త!

చైనీయులకు డ్రాగన్‌ హెచ్చరికలు

chinese
chinese

బీజింగ్‌: ప్రపంచంలోనే అగ్రదేశాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ ముదరుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లే చైనీయులకు ఆ దేశం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ వేధింపులు, భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని , అక్కడకు వెళ్లాలనుకునే వారు ముందుగా చట్టాలు, నిబంధనల గురించి తెలుసుకుని వెళ్లాలని సూచించింది.
వాణిజ్య యుద్ధం దృష్ట్యా గత 15 ఏళ్లలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లే చైనీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటీవల అమెరికా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/