నేపాల్‌కు చైనా భారీ సాయం

china-nepal
china-nepal

ఖాట్మండు : రాబోయే రెండేళ్లలో నేపాల్‌కు చైనా 56 బిలియన్ల నేపాలీ రూపాయల సహాయం అందిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు. నేపాల్ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సాయాన్ని వినియోగిస్తారు. నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీతో జీ జిన్‌పింగ్ చర్చలు జరిపిన సమయంలో ఈప్రకటన వెలువడింది. తన రెండు రోజుల నేపాల్ అధికారిక పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడికి చేరుకున్న ఆయన నేపాల్ అధ్యక్షురాలితో ఆమె అధికారిక నివాసం శీతల్ నివాస్‌లో సమావేశమయ్యారు. 23 ఏళ్ల తర్వాత ఒక చైనా ప్రధాని నేపాల్ సందర్శించడం ఇదే మొదటిసారి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/