చేపల్లో కరోనా..భార‌తీయ చేప‌ల‌పై చైనా నిషేధం

China-suspends-fish-imports-from-Indian-company

బీజింగ్‌: భారత్‌కు చెందిన బసు ఇంటర్నేషనల్‌ కంపెనీ నుండి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్‌ను గుర్తించడంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసినట్లు చైనా క‌స్ట‌మ్స్ ఆఫీసు అధికారులు వెల్ల‌డించారు. చేప‌ల‌ ప్యాకేజీల‌ను ప‌రిశీలించిన అధికారులు.. మూడు శ్యాంపిళ్ల‌లో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో ఆ చేప‌ల‌పై పాక్షికంగా బ్యాన్ విధిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే వారం రోజుల పాటు ఈ నిషేధం అమ‌లులో ఉంటుంది. వారం త‌ర్వాత ఆటోమెటిక్‌గా చేప‌ల దిగుమ‌తి ప్రారంభం అవుతుంద‌ని చైనాకు చెందిన క‌స్ట‌మ్స్ శాఖ త‌న ప్ర‌క‌టన‌లో వెల్ల‌డించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/