త్వరలో అమెరికాతో చర్చలకు సిద్ధం

China Flag
China Flag

చైనా:అమెరికాచైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలో జరగనున్న 13వ దఫా సంప్రదింపులకు చైనా ఉపప్రధాని లియూ హీ సహా ఉన్నతస్థాయి వాణిజ్య రాయబారి అమెరికా వెళ్లనున్నట్టు చైనా ప్రకటిచింది. సమావేశాలు జరిగే తేదీలు ప్రకటించనప్పటికీ చైనా జాతీయ దినోత్సవం అయిన అక్టోబర్‌ 7 అనంతరమే చర్చలు ఉంటాయని చైనా వాణిజ్య శాఖ సహాయ మంత్రి వాంగ్‌ షూవెన్‌ తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/