అమెరికాలో చైనా శాస్త్రవేత హత్య

తన ఇంట్లోనే హత్యకు గురైన బింగ్ లియు

Chinese researcher Dr Bing Liu killed

న్యూయార్క్‌: కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా పరిశోధకుడు బింగ్‌ లియు (37) శనివారం తన ఇంట్లో శవమై కనిపించారు. బింగ్‌ లియు పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. అయితే హోగు అనే 46 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆయనను కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకుని మరణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హోగు, బింగ్ లియు ఇద్దరూ పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. నిందితుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. లియు పరిశోధనలకు, ఈ హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/