10 మంది భారత సైనికుల‌ను విడిచిపెట్టిన చైనా

లడఖ్‌లో ఇటీవల ఘర్షణ

China Releases 10 Indian Army Soldiers

న్యూఢిల్లీ: గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో చైనాకు చిక్కిన 10 మంది భార‌త సైనికుల‌ను చైనా వ‌దిలిపెట్టింది. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత సైనికులను చైనా విడుదల చేసింది. వారిలో ఓ లెఫ్టినెంట్‌ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్మీ అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. కాగా, గ‌ల్వాన్ లోయ‌లో చైనా సైన్యంతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల సంద‌ర్భంగా భార‌త సైనికులు ఎవ‌రూ మిస్ కాలేద‌ని ఇండియ‌న్ ఆర్మీ అధికారులు గురువారం ప్ర‌క‌టించారు. ఇటీవల జరిగిన ఘర్షణలో మొత్తం 76 మంది భారత సైనికులు గాయాలపాలైనట్లు తెలిసింది. వారిలో చాలా మంది ఇప్పటికే కోలుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/