చైనాలో మళ్లీ కరోనా కలకలం

16,400 కొత్త కేసులు నమోదు

బీజింగ్: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహమ్మారి ధాటికి పెద్ద నగరాలైన షాంఘై, షెన్జెన్ వంటి నగరాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా చైనాలో 16,400 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో 13 వేల కేసులు ఒక్క షాంఘై నగరంలోనే నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. షాంఘైలో తొమ్మిది రోజుల క్రితం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగాయి. వైరస్ తీవ్రత తగ్గేవరకు లాక్ డౌన్ ఆంక్షల కొనసాగుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఓమిక్రాన్ బీఏ.2 వేరియంట్ కారణంగా చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తాజా రోజువారీ కేసులలో 80% కంటే ఎక్కువ షాంఘైలో ఉన్నాయని నేషనల్ హెల్త్ కమీషన్ మంగళవారం తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/