భారత్‌కు చైనా రెచ్చగొట్టే హెచ్చరికలు జారీ

హెచ్చరిక కాల్పులకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..చైనా

China accused India of provocative actions on the border

బీజింగ్‌: భారత్‌పై చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకెసింది. తాజాగా తన అధికార ప్రతిక గ్లోబల్‌ ట్రైమ్స్‌లో భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. భారత్‌తో చైనా ఏ మాత్రం యుద్ధం కోరుకోవడం లేదని పేర్కొంది. త‌మ దేశం చాలా మంచిద‌ని, దాన్ని అలుసుగా తీసుకుని కాల్పులు జ‌రిపితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. సరిహద్దుల్లో భారత ఆర్మీయే హద్దులు మీరుతోందంటూ వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మ‌ధ్య‌ చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించునేందుకు త‌మ దేశం ప్రయత్నిస్తోందని పేర్కొంది. త‌మ దేశ సైన్యం ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉందని తెలిపింది. భార‌త్ పై తన చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకునేలా చైనా ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. కాగా, సరిహద్దుల్లో భారత బలగాలే వాస్తవాధీన రేఖ దాటాయంటూ చైనా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోన్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, స‌రిహ‌ద్దుల వద్ద గ‌త అర్ధ‌రాత్రి భార‌త ఆర్మీయే కాల్పులు జ‌రిపింద‌ని చైనా ఆరోప‌ణ‌లు చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/