అమెరికా పై రగిలిపోతున్న చైనా..ప్రతీకార ఏర్పాట్లు!

China-US
China-US

చైనా: చైనాకు చెందిన హువావే, దానికి చెందిన 68 అనుబంధ సంస్థలు అమెరికాకు చెందిన సంస్థల నుంచి ఎటువంటి సాంకేతికత కొనుగోలు చేయకుండా ఆంక్షలను విధించింది. దీంతో చైనా రగిలిపోతోంది. ఈ సందర్భంగా అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చట్టాలకు పదును పెడుతోంది. దీని ప్రకారం చైనాకు చెందిన సైబర్‌ స్పేస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొన్ని నిబంధనలను సిద్ధం చేసింది. ఇవి అమల్లోకి వస్తే.. చైనాలో కీలకమైన విదేశీ పరికరాలు, సేవలను పొందితే వచ్చే ముప్పును పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు వెల్లడించింది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జూన్‌ 24లోపు ఈ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టనున్నారు. లీకింగ్‌, పోగొట్టుకోవడం, కీలక సమాచారం సరిహద్దులు దాటడం వంటి ముప్పులకు సంబంధించి ఇది ఉండవచ్చు. చైనా మార్కెట్లో ఉన్న అమెరికా సాంకేతికతను అడ్డుకొనేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/