అమెరికాను అధిగమించిన చైనా

China and America
China and America

చైనా: ప్రపంచవ్యాప్తంగా దౌత్య కార్యాలయాల ఏర్పాటులో అమెరికాను చైనా మించిపోయింది. సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్‌ జరిపిన అధ్యయనం ప్రకారం 2019లో చైనాకు 276 దౌత్య కార్యాలయాలు ఉండగా, అమెరికాకు మూడు తక్కువగా 273 ఉన్నాయి. చైనాకు 169 రాయబార కార్యాలయాలు, 96 కాన్సులేట్‌ కార్యాలయాలు, ఎనిమిది శాశ్వత దౌత్య కార్యాలయాలు, మూడు ఇతర దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. 2016లో అమెరికా, ఫ్రాన్స్‌ తరువాత చైనా మూడో స్థానంలో ఉండేది. ప్రస్తుతం భారత్‌ 12వ స్థానంలో ఉంది. మనకు 123 రాయబార కార్యాలయాలు, 54 కాన్సులేట్‌ కార్యాలయాలు, అయిదు శాశ్వత దౌత్య కార్యాలయాలు, నాలుగు ఇతర కార్యాలయాలు ఉన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/