హాంగ్‌కాంగ్‌లో చైనా నూతన కార్యాలయం

హాంగ్‌కాంగ్‌లో చైనా నూతన కార్యాలయం
China opens new security agency headquarters in Hong Kong

హాంగ్‌కాంగ్‌: చైనా హాంగ్‌కాంగ్‌లో నూతన సెక్యూరిటీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంను ప్రారంభించింది. ఈరోజు జ‌రిగిన ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో హాంగ్‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్‌, చైనా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు ఆ కార్యాలయంను వినియోగించ‌నున్నారు. నేష‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీసును ప్రారంభించినందుకు హాంగ్‌కాంగ్మ‌కావు వ్య‌వ‌హారాల శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో శుభాకాంక్ష‌లు తెలిపింది. కొత్త చ‌ట్టం కింద భద్ర‌తా ఏజెంట్లు హాంగ్‌కాంగ్‌లో ప‌నిచేస్తారు. వేర్పాటువాదులు, ఉగ్ర‌వాదుల‌ను ఆ ఏజెంట్లు ప‌ట్టుకుంటారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/